గుంటూరులో.. ఎనిమిదిమంది విద్యార్థులకు కరోనా

ABN , First Publish Date - 2020-11-06T15:31:21+05:30 IST

జిల్లాలో గురువారం ఎనిమిది మంది విద్యార్థులకు..

గుంటూరులో.. ఎనిమిదిమంది విద్యార్థులకు కరోనా

గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఎనిమిది మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ నిర్ధారణ అయింది. మాచర్ల జడ్పీ హైస్కూల్‌లో నలుగురు, చిలకలూరిపేట సమీపంలోని కావూరు జడ్పీ స్కూల్‌లో ఇద్దరు, భట్టిప్రోలు జడ్పీ హైస్కూల్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రధానంగా కొవిడ్‌-19 పాజిటివ్‌గా టెస్టింగ్‌ అయిన కొంత మంది ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం వర్కర్లు తమకు లక్షణాలేవీ లేవని నిర్లక్ష్యంగా ఉంటూ పాఠశాలలకు వస్తుం డటం వలనే ఈ సమస్య ఉత్పన్నమౌతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మొండిగా పాఠశాలలు తెరవడం వలనే ఈ పరిస్థితి ఉత్పన్నమౌతోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. 


కొత్తగా 297 కరోనా కేసులు

జిల్లాలో కొత్తగా 297 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 70,302కి చే రింది. గురువారం కరోనాతో ఒకరు చనిపోవడంతో మృ తుల సంఖ్య 680కి పెరిగింది. తాజాగా గుంటూరు నగరంలో 51, మంగళగిరి - 31, తెనాలి - 20, రేపల్లె - 14, బాపట్ల - 12, పొన్నూరు - 12, తుళ్లూరు - 11 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇవికాక మరికొన్ని మండలాల్లో కలిపి 146 పాజి టివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జె.యాస్మిన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-11-06T15:31:21+05:30 IST