గుంటూరు జిల్లాలో కొత్తగా 479మందికి కరోనా..

ABN , First Publish Date - 2020-09-13T14:06:31+05:30 IST

జిల్లాలో శనివారం కరోనా వైరస్‌ తీవ్రత కొంచెం తగ్గింది. గత కొద్ది రోజుల నుంచి..

గుంటూరు జిల్లాలో కొత్తగా 479మందికి కరోనా..

గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం కరోనా వైరస్‌ తీవ్రత కొంచెం తగ్గింది. గత కొద్ది రోజుల నుంచి నిత్యం 700 నుంచి 900 మధ్యన నమోదు అవుతున్న కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు గడిచిన 24 గంటల్లో 479 మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 46,454కు చేరుకుంది. శనివారం మరో ఆరుగురు మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 522కు చేరింది. కరోనా నుంచి 32,084(69.07 శాతం) మంది కోలుకోగా ఇంకా 13,848(29.81 శాతం) మంది వైరస్‌తో పోరాడుతున్నారు.  నగరంలో 12, రొంపిచర్లలో 13, నకరి కల్లులో 10, మిగిలిన మం డలాల్లో మరో 93 కేసులు నమో దయ్యాయి.  ఫిరంగిపురం మండలం 113 తాళ్ళూరుకు చెందిన రైతు నేత పాకనాటి సుబ్బారెడ్డి కరోనాతో శనివారం ఉదయం మృతి చెందారని బంధువులు తెలిపారు. 

Updated Date - 2020-09-13T14:06:31+05:30 IST