-
-
Home » Andhra Pradesh » Guntur » corona
-
కరోనా.. 172
ABN , First Publish Date - 2020-11-27T05:57:44+05:30 IST
జిల్లాలో కొత్తగా 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి 6,244 శాంపిల్స్ ఫలితాలు విడుదల కాగా అందులో 2.75శాతం మందికి పాజిటివ్ వచ్చింది.

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో కొత్తగా 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి 6,244 శాంపిల్స్ ఫలితాలు విడుదల కాగా అందులో 2.75శాతం మందికి పాజిటివ్ వచ్చింది. మిగిలిన 6,072(97.25 శాతం) మందికి నెగెటివ్‌గా తేలింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 74,185కు చేరుకోగా వారిలో 72,535 (97.77శాతం) మంది కోలుకొన్నారు. 711 మంది మరణించారు. ప్రస్తుతం 939(1.27శాతం) యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కొత్తగా గుంటూరు నగరంలో 56, తెనాలిలో 15, మంగళగిరిలో 14, బాపట్లలో 12, తాడేపల్లిలో 10, చిలకలూరిపేటలో 9, దుగ్గిరాలలో 7 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇవికాక మరికొన్ని మండలాల్లో మరో 49 మందికి వైరస్ సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె.యాస్మిన్ తెలిపారు. గురువారం సాయంత్రం వరకు మరో 4,174 శాంపిల్స్‌ని టెస్టింగ్ నిమిత్తం సేకరించారు.