పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-05T15:12:58+05:30 IST

పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం జగన్‌ను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు అపాయింట్‌మెంట్ కోరారు.

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ హౌస్ అరెస్ట్

గుంటూరు: పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం జగన్‌ను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు అపాయింట్‌మెంట్ కోరారు. అయితే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నేరుగా వెళ్లేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో పలువురు ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేస్తున్నారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోగా తమను ఎలా గృహ నిర్బంధం చేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-12-05T15:12:58+05:30 IST