5న సీఎంను కలుస్తాం..

ABN , First Publish Date - 2020-12-02T05:13:07+05:30 IST

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 5న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలవనున్నట్లు ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి తెలిపారు.

5న సీఎంను కలుస్తాం..

మంగళగిరి నుంచి క్యాంపు కార్యాలయానికి..

ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి


గుంటూరు, డిసెంబరు 1: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 5న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలవనున్నట్లు ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి తెలిపారు. రాజీవ్‌గాంధీభవన్‌లో మంగళవారం రాజధాని పరిరక్షణ సమితి సమావేశం జరిగింది. మస్తాన్‌వలి మాట్లాడుతూ ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌  సాకే శైలజానాఽథ్‌ నేతృత్వంలో 5వ తేదీన మంగళగిరి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లి ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలవనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొమ్మినేని సురేష్‌, చిలకా విజయ్‌కుమార్‌, పీసీసీ నేతలు సుంకర పద్మశ్రీ,  లింగంశెట్టి ఈశ్వరరావు, మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి ఇతర నేతలు ఉన్నారు.

Updated Date - 2020-12-02T05:13:07+05:30 IST