నిషేధిత గుట్కాలు స్వాధీనం.. ఇద్దరిపై కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-02-12T11:28:02+05:30 IST

పట్టణంలోని చలివేంద్రం బజారులో ఉన్న ఓ ఫ్యాన్సీ దుకాణం, అమరావతి టీస్టాల్‌ ఎదురుగా ఉన్న బడ్డీ దుకాణంలో నిషేధిత గుట్కా

నిషేధిత గుట్కాలు స్వాధీనం.. ఇద్దరిపై కేసుల నమోదు

చిలకలూరిపేట, ఫిబ్రవరి 11: పట్టణంలోని చలివేంద్రం బజారులో ఉన్న ఓ ఫ్యాన్సీ దుకాణం, అమరావతి టీస్టాల్‌ ఎదురుగా ఉన్న బడ్డీ దుకాణంలో నిషేధిత గుట్కా నిల్వలు ఉన్నాయనే సమాచారంతో చిలకలూరిపేట అర్బన్‌ ఇన్‌చార్జి సీఐ ఎం సుబ్బారావు, ఎస్‌ఐ షఫి ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఆయా దుకాణాలలో అక్రమంగా నిల్వ ఉంచిన  రూ.1లక్షకు పైగా విలువైన గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆయా దుకాణాల నిర్వాహకులు పోలిశెట్టి శ్రీనివాసరావు, తోట వెంకటేశ్వరరావులపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు. ఈసందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడుతూ నిషేధిత గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు అమ్మినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు.

Updated Date - 2020-02-12T11:28:02+05:30 IST