రోడ్లపై, కాలువల్లో చెత్తవేస్తే అపరాధ రుసుం

ABN , First Publish Date - 2020-11-26T05:05:11+05:30 IST

రోడ్లపై, కాలువల్లో చెత్త వేసే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని నగర పాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టం చేశారు.

రోడ్లపై, కాలువల్లో చెత్తవేస్తే అపరాధ రుసుం

నగర కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు (కార్పొరేషన్‌), నవంబరు 25: రోడ్లపై, కాలువల్లో చెత్త వేసే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని నగర పాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టం చేశారు. స్థానిక కాకుమాను వారితోట, అలీనగర్‌, సుద్దపల్లి డొంకరోడ్డు, దుర్గానగర్‌, జానీ స్వరాజ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో బుధవారం అభివృద్ధి పనులను తనిఖీచేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాలప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. తడి చెత్తతో ఎరువు తయారు చేసుకోవాలని, అవసరమైతే తయారు చేసిన ఎరువుని నగరపాలక సంస్థ కొనుగోలు చేస్తుందన్నారు.  కాకుమానువారితోటలో నిర్మించిన కాలువల్లో లెవల్స్‌ పాటించలేదని ఏఈని ఆదేశించారు. నాజ్‌సెంటర్‌లోని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్‌ మాట్లాడుతూ కార్మికులు విధులు బాధ్యతగా నిర్వహించాలన్నారు.  కార్యక్రమంలో టి.కృష్ణయ్య, డి.శ్రీనివాసరావు, డీఈఈ ప్రసాద్‌, ఏఈలు రాంబాబు, దుర్గాప్రసాద్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ ఆనందకుమార్‌, డాక్టర్‌ వెంకటరమణ, రాంబాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ దౌలా, సెక్రటరీలు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-26T05:05:11+05:30 IST