-
-
Home » Andhra Pradesh » Guntur » commissionar
-
తడి, పొడి చెత్తను వేరు చేయాలి
ABN , First Publish Date - 2020-11-28T04:42:20+05:30 IST
ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, దుకాణాలలో తయారయ్యే వ్యర్ధాలను తడి పొడిగా వేరు చేసి, పొడిచెత్తనే మున్సిపల్ సిబ్బందికి అందించాలని తడి చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవాలని నగర కమిషనర్ చల్లా అనురాధ సూచించారు.

నగర కమిషనర్ చల్లా అనురాధ
గుంటూరు(కార్పొరేషన్), నవంబరు 27: ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, దుకాణాలలో తయారయ్యే వ్యర్ధాలను తడి పొడిగా వేరు చేసి, పొడిచెత్తనే మున్సిపల్ సిబ్బందికి అందించాలని తడి చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవాలని నగర కమిషనర్ చల్లా అనురాధ సూచించారు. శాంతినగర్, శివరామ నగర్, చుట్ట గుంట తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చిదిద్దాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. రోడ్లు, కాలువలపై చెత్త వేసేవారిని గుర్తించి వారి నివాసాలకు తాగునీటి ట్యాప్ కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించారు. తుఫాన్ వలన కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక అమరావతిరోడ్ నగరాలులోని ఇండస్ర్టియల్ ఎస్టేట్‌లో చెత్త వేసి తగులబెట్టిన వారి నుంచి నగరపాలక ప్రజారోగ్య అధికారులు రూ.2000 జరిమానా వసూలు చేశారు.