సచివాలయాల ద్వారా పారదర్శక సేవలు

ABN , First Publish Date - 2020-12-12T05:28:28+05:30 IST

ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందించేందుకే సచివాలయ వ్యవస్థ అని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ తెలిపారు.

సచివాలయాల ద్వారా పారదర్శక సేవలు
సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌, పక్కన కమిషనర్‌

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద కుమార్‌

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 11:  ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందించేందుకే సచివాలయ వ్యవస్థ అని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ తెలిపారు. స్థానిక అంకిరెడ్డిపాలెం వార్డు సచివాలయాన్ని ఆయన శుక్రవారం నగర కమిషనర్‌ చల్లా అనురాధతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైస్‌కార్డులు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వలంటీర్లు అందించాలన్నారు. ఇళ్లలోని తడి పొడి చెత్తను వేరువేరుగా డస్ట్‌బిన్‌లలో వేయాలన్నారు.  కార్యక్రమంలో వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ సయ్యద్‌ రమీజ్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌ శివజ్యోతి, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. 

భవన నిర్మాణ సామగ్రికి టెండర్లు 


పేదల గృహాల నిర్మాణానికి అవసరమైన భవన నిర్మాణ సామగ్రికి ప్రభుత్వ నిబంధనల మేరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సం బంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సా యంత్రం కలెక్టెరేట్‌లో ఇళ్ల పథకం భవన నిర్మాణ సా మగ్రి టెండర్‌ నిర్ధారణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో తొలి విడతగా 1,63,053 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యం నిర్దేశిం చిందన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన భవన నిర్మా ణ సామాగ్రిని లబ్ధిదారులు కోరితే ప్రభుత్వమే హౌసింగ్‌ డిపార్టుమెంట్‌ ద్వారా అందజేస్తుందన్నారు. టెండర్ల పరి శీలన కోసం సాంకేతిక, నిర్ధారణ, ఆర్థిక కమిటీలను ఏర్పా టు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ (సచివాలయాలు) పి.ప్రశాంతి, హౌసింగ్‌ పీడీ వేణు గోపాల్‌రావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మాధవి సుకన్య, డీపీవో కొండయ్య, సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ విజయకుమార్‌, పరి శ్రమల శాఖ జీఎం పటేల్‌, మైనింగ్‌ డీడీ సుబ్ర హ్మణ్యేశ్వరరావు, జిల్లా ఇసుక అధికారి వెంకటేశ్వరరెడ్డి,  డిప్యూటీ కమిషనర్‌ మల్లేశ్వరరావ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-12T05:28:28+05:30 IST