ప్రభుత్వ సేవలను అర్హులందరికీ అందించేందుకే సచివాలయ వ్యవస్థ
ABN , First Publish Date - 2020-11-13T06:03:17+05:30 IST
ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి ముంగిటికే పారదర్శకంగా అందించేందుకే సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేశారని కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ తెలిపారు.
పెదకాకాని సచివాలయ తనిఖీలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్
పెదకాకాని, నవంబర్ 12: ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి ముంగిటికే పారదర్శకంగా అందించేందుకే సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేశారని కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ తెలిపారు. సచివాలయ ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలన్నారు. పెదకాకాని గ్రామ సచివాలయంను గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సచివాలయంలో ప్రభుత్వ పథకాల ప్రచార పోస్టర్లను, అన్నిరకాల రిజిస్టర్లను, హాజరు పట్టీలను పరిశీలించారు. సచివాలయంలోని రిజిస్టర్లను ఫార్మాట్ల ప్రకారం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పెదకాకాని మండల ఇన్‌చార్జ్ తహసీల్దార్ దినేష్, ఎంపీడీవో హనుమరెడ్డి, పంచాయతీ సెక్రటరీ వాలిచెర్ల రవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.