వల్లభాయి పటేల్‌, పొట్టి శ్రీరాములుకు నివాళి

ABN , First Publish Date - 2020-12-16T05:14:12+05:30 IST

సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ దేశంలో సంస్థానాలను విలీనం చేసిన గొప్ప దేశ భక్తుడని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అన్నారు.

వల్లభాయి పటేల్‌, పొట్టి శ్రీరాములుకు నివాళి

గుంటూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సర్ధార్‌ వల్లభాయి పటేల్‌  దేశంలో సంస్థానాలను విలీనం చేసిన గొప్ప దేశ భక్తుడని  కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అన్నారు. అలానే ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని కీర్తించారు. వీరి అడుగుజాడలు ఎప్పటికీ అనుసరణీయమన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వల్లభాయి పటేల్‌, పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జేసీ(ఆసర) కె.శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో సి.చంద్రశేఖర్‌ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కల్పనబేబి తదితరులు పాల్గొన్నారు. 

Read more