లేఅవుట్ల పనులు వేగంగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-12-15T05:46:23+05:30 IST

పేదలందరికి ఇళ్ల పథకానికి సంబంధించి లేఅవుట్ల అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో ఉదాశీనంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హెచ్చరించారు.

లేఅవుట్ల పనులు వేగంగా పూర్తిచేయాలి

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌


గుంటూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పేదలందరికి ఇళ్ల పథకానికి సంబంధించి లేఅవుట్ల అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో ఉదాశీనంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకొంటామని  కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లతో మాట్లాడారు. తొలుత పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా లేఅవుట్లను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  డిసెంబరు 25వ తేదీ నాటికి పూర్తి చేసి ఇళ్ల పట్టాల పంపిణీకి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ నతానియేల్‌, కలెక్టరేట్‌ ఏవో మల్లికార్జునరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-15T05:46:23+05:30 IST