సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి

ABN , First Publish Date - 2020-11-28T05:22:30+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు.

సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి
సచివాలయంలో తనిఖీ చేస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ఆదేశాలు

గుంటూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన మేడికొండూరు మండలంలోని పేరేచర్ల-3, నగరంలోని సంపత్‌నగర్‌ మెయిన్‌రోడ్డులో ఉన్న 59, 60 వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ప్రభుత్వ సంక్షమే పథకాలు ప్రజల ముంగిటకు పారదర్శకంగా, వేగవంతంగా అందించే 


లక్ష్యానికి అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడికొండూరు తహసీల్దార్‌ కరుణకుమార్‌, ఎంపీడీవో శోభారాణి, నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


Read more