-
-
Home » Andhra Pradesh » Guntur » collector
-
దత్తత ప్రక్రియ మరింత సులభతరం
ABN , First Publish Date - 2020-11-21T05:33:06+05:30 IST
ప్రభుత్వం పిల్లల దత్తత ప్రక్రియను సులభతరం చేసినట్లు కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు.

కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్
గుంటూరు (మెడికల్), నవంబరు 20: ప్రభుత్వం పిల్లల దత్తత ప్రక్రియను సులభతరం చేసినట్లు కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రిలోని దిశ కార్యాలయంలో ఊయల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో ప్రభుత్వాస్పత్రులు, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర 14 చోట్ల ఊయల కార్యక్రమం ప్రారంభించినట్లు వెల్లడించారు. పిల్లలు లేని దంపతులు నిబంధనలను అనుసరించి చట్టప్రకారం పిల్లలను దత్తత తీసుకోవాలని ఆయన సూచించారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఆసుపత్రులు, చెత్తకుప్పల్లో పడేసి వెడుతున్నారని, ఇలాంటి వారు తమ బిడ్డలను బస్టాండ్, రైల్వేస్టేషన్‌ల్లో ఏర్పాటు చేసిన ఊయలలో వేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సంయుక్త కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ పిల్లలకు సంబంఽధించి అన్ని విషయాలను పరిశీలించి చట్టప్రకారం దత్తత ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.ప్రభావతి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.మనోరంజని, దిశ సిబ్బంది శాంతిభూషణ్ గోపి, విజయలక్ష్మి, స్వర్ణ, మల్లిక తదితరులు పాల్గొన్నారు.