బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-12-30T05:18:35+05:30 IST

కొవిడ్‌ సమయంలో బాలల పరిరక్షణకు విద్య, వైద్య, కార్మిక, పోలీసుశాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు ప్రశంసనీయం అని జాతీయ బాలల హక్కుల పరిక్షణ సంఘం సభ్యుడు ఆర్జీ ఆనంద్‌ అన్నారు.

బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ బాలల హక్కుల పరిక్షణ సభ్యుడు ఆర్జీ ఆనంద్‌, పాల్గొన్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరె డ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంతి తదితరులు

జాతీయ బాలల హక్కుల పరిక్షణ సంఘం సభ్యుడు ఆర్జీ ఆనంద్‌


గుంటూరు(తూర్పు), డిసెంబరు29:  కొవిడ్‌ సమయంలో బాలల పరిరక్షణకు విద్య, వైద్య, కార్మిక, పోలీసుశాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు ప్రశంసనీయం అని  జాతీయ బాలల హక్కుల పరిక్షణ సంఘం సభ్యుడు ఆర్జీ ఆనంద్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం మహిళలు, బాలల హక్కుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.   కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో 18  ఏళ్ల లోపు ఉన్న 76,776 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 7,298 పాజిటివ్‌ గా తేలిందన్నారు.   ప్రస్తుతం వందశాతం రికవరీ అయ్యాయని తెలిపారు. సమావేశంలో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి, మహిళా, శిశుసంక్షేమశాఖ పీడీ మనోరంజని, బాలల హక్కుల సమితి మాజీ సభ్యురాలు పద్మలత తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

Updated Date - 2020-12-30T05:18:35+05:30 IST