-
-
Home » Andhra Pradesh » Guntur » chilaka chandrasekhar
-
అక్రమ కేసులను ఎత్తివేయాలి
ABN , First Publish Date - 2020-11-28T04:51:35+05:30 IST
అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరిలను పోలీసులు అరెస్టు చేయడాన్ని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ శుక్రవారం ఖండించారు.

అంజమ్మ, రాజేశ్వరిలను బేషరతుగా విడుదల చేయాలి
పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్ర శేఖర్
నరసరావుపేట, నవంబరు 27: అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరిలను పోలీసులు అరెస్టు చేయడాన్ని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ శుక్రవారం ఖండించారు. ఎన్జీవో హోంలో జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పోరాడే ప్రజా సంఘాల నేతలపై ఊపా లాంటి చట్టాలు మోపి అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. తెలంగాణ, అంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అక్రమ కేసులు బనాయిండంలో కలసికట్టుగా పని చేస్తున్నాయన్నారు. పలు సంఘాలకు చెందిన 25 మందికి పైగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ విశాఖలో, పిడుగురాళ్ల పోలీసుస్టేషన్ పరిధిలో ఊపా చట్టం కింద కేసులు బనాయించి భయబ్రాంతులకు గుచిచేయడమే కాక వారిని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. అరెస్టు చేసిన మహిళలను బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎం రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు నల్లపాటి రామారావు, శిఖనం చిన్న, కంబాల ఏడుకొండలు, జి.రామకృష్ణ పాల్గొన్నారు.