‘చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డికి మతిభ్రమించింది’
ABN , First Publish Date - 2020-02-08T15:00:46+05:30 IST
టీడీపీలో చీలిక రాబోతుందంటూ వైసీపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి..

గుంటూరు(ఆంధ్రప్రదేశ్): టీడీపీలో చీలిక రాబోతుందంటూ వైసీపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధులు కనపర్తి శ్రీనివాసరావు, బొబ్బిలి రామారావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం జగన్‌కు ఇంటి పోరు ఎక్కువై బాబాయి వివేకానందరెడ్డిని బలిగొన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. అధికారంలోకి రాకముందు ఆ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరి నేడు వద్దని హైకోర్టును ఆశ్రయించిన సంగతి శ్రీకాంత్‌రెడ్డికి తెలియదా అని నిలదీశారు. మూడు తరాల ఫ్యాక్షన్ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరుగాంచిన జగన్‌ను అభివృద్ధి ప్రదాతగా చూపించాలని శ్రీకాంత్‌రెడ్డి తాపత్రయపడటం సిగ్గు చేటన్నారు.