ప్రజా చైతన్య యాత్రకు సిద్ధం

ABN , First Publish Date - 2020-02-12T11:16:44+05:30 IST

గతంలో ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర, తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రలను చం ద్రబాబు నిర్వహించినప్పుడు పార్టీ వర్గాలు ఏక తాటి పైకి వచ్చి ఎక్కడికక్కడ

ప్రజా చైతన్య యాత్రకు సిద్ధం

  • టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం 
  • వైసీపీ వైఫల్యాలపై నివేదిక రూపకల్పన 
  • చంద్రబాబు బస్సుయాత్రలో ... ప్రజల ముందుకు

గుంటూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గతంలో ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర, తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రలను చం ద్రబాబు నిర్వహించినప్పుడు పార్టీ వర్గాలు ఏక తాటి పైకి వచ్చి ఎక్కడికక్కడ బాధ్యతలు తీసు కొని విజయవంతం చేశాయి. అదే సమష్టి త త్వాన్ని ప్రజాచైతన్య బస్సు యాత్రలోనూ కొన సాగించి ప్రజల మద్దతు కూడ గట్టుకోవాలని యోచిస్తున్నాయి. గత ఎనిమిది నెలల వైసీపీ ప్రభుత్వ పరిపాలన అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ పేర్కొంటోన్నది. అమరావతి రాజధాని నగర నిర్మాణాన్ని నిలిపేయడంతోపాటు వికేంద్రీకరణకు పూను కోవడంతో భూములు ఇచ్చిన వేల మంది రైతు కుటుంబాలు రోడ్డునపడ్డాయి. గత 56 రోజుల నుంచి వాళ్లు రోడ్లపైనే ఉంటూ ఉద్య మిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా మొండిగా ముం దుకెళుతోన్నది. మరోవైపు జిల్లాలో పెద్దఎత్తున రేషన్‌కార్డులు, సామాజిక భద్రత పెన్షన్లను తొలగించింది. దాదాపుగా లక్షా 10వేల రేషన్‌ కార్డులు, 34వేలకు పైగా పెన్షన్లు నిలిచి పోయాయి. ఎన్నికలకు ముందు జగన్‌ చేసిన వాగ్దానాలకు, ఇప్పుడు అమలు చేస్తున్నదానికి పొంతన లేదని టీడీపీ నేతలు చెబుతన్నారు. ఆరు అంచెల మూల్యాంకనం పేరుతో పెద్ద సంఖ్యలో అనర్హులుగా చేశారు. 

జిల్లాకు సంబంధించినంతవరకు వైసీపీ స్థానిక నాయకులు ప్రత్యేక మేనిఫెస్టోని ఎన్నికల సమయంలో ప్రకటించారు. దానిలో ఏ ఒక్కటి అమలుకు శ్రీకారం చుట్టలేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గోదావరి - పెన్నా నదుల అనుసంఽధానం పనులు నిలిపేశారు. దీని వలన రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. పేరేచర్ల-కొండమోడు రహదారి విస్తరణ పనులకు టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపనచేయగా ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. దీనివలన ఆ రహదారిలో నిత్యం రోడ్డుప్రమాదాలు జరు గుతూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం ఈ రహదారిలో ఫిరంగిపురం వద్ద జరిగిన  ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులకు బడ్జెట్‌లో నిధులు నామమాత్రంగానే కేటా యుంచడంతో సర్వేపనులు కూడా సక్రమంగా జరగడం లేదు. ఽధాన్యం, మిర్చి ధరలు పడిపోయినా ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి రైతులను ఆదుకోలేదు. ఈ వైఫల్యాలన్నింటిని చంద్రబాబుకు నివేదించి బస్సుయాత్రలో ఎండగట్టించాలని టీడీపీ నాయకులు ఒక నివేదికని సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న దృష్ట్యా ఈ యాత్ర పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తుందని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. 

Updated Date - 2020-02-12T11:16:44+05:30 IST