చాంబర్‌ అధ్యక్షుడిగా.. ఆతుకూరి

ABN , First Publish Date - 2020-12-30T05:30:00+05:30 IST

ది ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడిగా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చాంబర్‌ అధ్యక్షుడిగా.. ఆతుకూరి
ఆంజనేయులును అభినందిస్తున్న చాంబర్‌ కార్యవర్గ సభ్యులు

31వ సారి ఎన్నికైన ఆంజనేయులుకు పలువురి అభినందనలు


గుంటూరు, డిసెంబరు 30: ది ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడిగా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చాంబర్‌ ఎన్నికలకు ఈ నెల 24న నామినేషన్ల ప్రక్రియ జరిగింది. అధ్యక్షుడుగా ఆంజనేయులు ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది. దీంతో ఆయన 31వ సారి చాంబర్‌కు  అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అయ్యింది. మొదట్లో ఐదు దఫాలు ఎన్నికలు జరిగ్గా ఆయనే ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 26 సార్లు పోటీ లేకుండా ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికై అరుదైన ఘనత సాధించారు. చాంబర్‌ ఉపాధ్యక్షులుగా తూనుగుంట్ల నాగేశ్వరరావు, కొప్పురావూరి ఏడుకొండలు, తడికమళ్ళ సూర్యప్రకాశరావు, టీఎల్‌వీ వీరాంజనేయులు, గొల్లపూడి కాశీవెంకటరాంబాబు, రంగా వెంకటరామకృష్ణ, కార్యదర్శులుగా రంగా బాలకృష్ణ, అన్నా పూర్ణచంద్రరావు, గార్లపాటి సత్యనారాయణ, 29 మంది కార్యవర్గ సభ్యులను, మరో 9 మంది అనుబంధ సంస్థల కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 31వ సారి ఎన్నికైన ఆతుకూరి ఆంజనేయులును కార్యవర్గ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా బెంగళూరులో టెన్నిస్‌ శిక్షణకు ఎంపికైన కొల్లిపర చరిస్మాకు రూ.21 వేలను చాంబర్‌ తరపున ఆర్థిక సహాయం అందచేశారు. అనంతరం వైద్యులు వై షేక్‌,  నవీన్‌, ఎస్‌ తేజలను సత్కరించారు.

Updated Date - 2020-12-30T05:30:00+05:30 IST