37 మంది బాలకార్మికుల సంరక్షణ

ABN , First Publish Date - 2020-07-18T10:04:47+05:30 IST

అర్బన్‌ జిల్లా పరిధిలో ఆపరేషన్‌ ముష్కాన్‌లో భా గంగా శుక్రవారం 37 మంది బాలకా ర్మికులను పోలీసులు సంరక్షించారు.

37 మంది బాలకార్మికుల సంరక్షణ

గుంటూరు, జూలై 17: అర్బన్‌ జిల్లా పరిధిలో ఆపరేషన్‌ ముష్కాన్‌లో భా గంగా శుక్రవారం 37 మంది బాలకా ర్మికులను పోలీసులు సంరక్షించారు. లాలాపేట, పాతగుంటూరు, నగ రంపాలెం, పట్టాభిపురం, అరండల్‌పేట, నల్లపాడు, మంగళగిరిటౌన్‌, మేడి కొం డూరు, చేబ్రోలు, ప్రత్తిపాడు, వట్టి చెరుకూరు తదితర స్టేషన్ల పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించిన వా రిని గుర్తించారు. 24 మంది బాలురు, 13 మంది బాలికలను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచిన అ నంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.


కార్మి కశాఖ అధికారి బి.కోటేశ్వరరావుతో కలసి ఏహె చ్‌టీయూ ఏఎస్‌ఐలు బేబీరాణి, ఎలిజబెత్‌రాణి, బచావో ఆందోళన్‌ తిరుపతిరావు తదితరులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. వీరిలో ఓ బాలికను సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ సుగుణాల రాణి ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపర్చగా వారిని వడ్లమూడి వద్ద ఉన్న హార్వెస్ట్‌ ఇండియా సంస్థలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రెస్క్యూహోంకు తరలించాల్సిందిగా ఆదేశించారు. చిన్నారులకు క రోనా సహా అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలని అర్బన్‌ ఏస్పీ అమ్మిరెడ్డి ఆదేశించారు.  ఈ కార్య క్రమంలో అదనపు ఎస్పీ గంగాధరం, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-07-18T10:04:47+05:30 IST