మీరు ఇస్తామన్న స్థలాలు కనపడటం లేదు...?

ABN , First Publish Date - 2020-08-18T10:18:40+05:30 IST

పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీకి తాము వ్యతిరేకం కాని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. భూములు కొనుగోళ్లలో జరిగిన అవినీతికి మాత్రమే తాము వ్యతిరే

మీరు ఇస్తామన్న స్థలాలు కనపడటం లేదు...?

 పేదలకు స్థలాల పంపిణీకి మేం వ్యతిరేకం కాదు

 మాజీ మంత్రి నక్కా ఆనందబాబు


గుంటూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీకి తాము వ్యతిరేకం కాని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.  భూములు కొనుగోళ్లలో జరిగిన అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. గుంటూరులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ వర్షాలకు పేదలకు స్థలాలు ఇస్తామన్న భూములు కనపడటం లేదని ఎద్దేవా చేశారు.  అమరావతి రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారని..


వాటిలో ఇళ్ల స్థలాలకు పంపిణీ చేయటం తగదన్నారు.  రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్లస్థలాల పంపిణీ (ఆర్‌5 జోన్‌) అంశంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించడం ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. వాటాల్లో వచ్చిన తేడాలతోనే స్థలాల పంపిణీ వాయిదా వేశారని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని సీఎం జగన్‌కు సవాలు విసిరారు. కార్యక్రమంలో మిర్చియార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, నేతలు ఎం.ధారునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-18T10:18:40+05:30 IST