-
-
Home » Andhra Pradesh » Guntur » canara
-
ఖాతాదారులకు మెరుగైన సేవలు
ABN , First Publish Date - 2020-11-21T05:48:56+05:30 IST
ఖాతాదారులకు మెరుగైన సేవలందించటమే లక్ష్యంగా కెనరా బ్యాంకు యాజ మాన్యం కృషి చేస్తోందని ఆ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ (విజయవాడ) ఐ.షబ్బీర్ హుస్సేన్ పేర్కొన్నారు.

కెనరా బ్యాంక్ సీజీఎం షబ్బీర్ హుస్సేన్
గుంటూరు, నవంబరు 20: ఖాతాదారులకు మెరుగైన సేవలందించటమే లక్ష్యంగా కెనరా బ్యాంకు యాజ మాన్యం కృషి చేస్తోందని ఆ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ (విజయవాడ) ఐ.షబ్బీర్ హుస్సేన్ పేర్కొన్నారు. గుంటూ రులోని రీజనల్ కార్యాలయంలో బ్యాంకు 115వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి వెలిగించిన ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తూ బ్యాంకు పురోభివృద్ధిలో ఉద్యో గులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో డీజీఎం సర్కిల్ ఆఫీస్ (విజయవాడ) టీజీ బోరయ్య, ఏజీఎం పి.ముత్తులక్ష్మి, వివిధ శాఖల అధి కారులు ఉన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో సువి శాలమైన నూతన భవనంలోకి మార్చిన రీజనల్ కార్యా లయాన్ని సీజీఎం షబ్బీర్ హుస్సేన్ ప్రారంభించారు.