ప్రశాంతంగా నీట్‌

ABN , First Publish Date - 2020-09-14T08:54:23+05:30 IST

మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్‌) ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా నీట్‌

6,907 మంది విద్యార్థులు హాజరు

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అనుమతి

పరీక్షా కేంద్రాలను పరిశీలించి అర్బన్‌ ఎస్పీ


గుంటూరు(విద్య), సెప్టెంబరు 14: మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్‌) ప్రశాంతంగా ముగిసింది. గుంటూరుతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్‌, ఫార్మసీ, వైద్య కళాశాలల్లో మొత్తం 15 కాలేజీల్లో ఈ పరీక్ష నిర్వహించారు.  పరీక్షకు 7,395 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 6,907 మంది హాజరయ్యారు. తొలుత భౌతికదూరం పాటిస్తూ క్యూలైనుల్లో నుంచి ధర్మల్‌ స్కీనింగ్‌ చేయించుకుని కేంద్రాల్లోకి వెళ్ళారు. 


విద్యార్థుల కోసం శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచారు. గుంటూరులోని ఆయా పరీక్షా కేంద్రాలను అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరుతో పాటు అక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీ వెంట స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ బాల సుందరరావు, పట్టాభిపురం సీఐ పూర్ణచంద్రరావు, నగరంపాలెం ఎస్‌ఐ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను నిబంధనల ప్రకారం అనుమతించలేదు. కొవిడ్‌ నిబంధనల పాటిస్తూ పరీక్ష ప్రశాంతగా పూర్తిచేసినట్లు నీట్‌ జిల్లా సమన్వయకర్త యలమంచిలి రాధినిచౌదరి తెలిపారు.

Updated Date - 2020-09-14T08:54:23+05:30 IST