-
-
Home » Andhra Pradesh » Guntur » bund
-
భారత్ బంద్‌కు మద్దతు
ABN , First Publish Date - 2020-12-07T05:18:53+05:30 IST
ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా మంగళవారం జరిగే భారత్‌బంత్‌ను విజయవంతం చేయాలని నేతలు కోరారు.

గుంటూరు (సంగడిగుంట), డిసెంబరు 6: ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా మంగళవారం జరిగే భారత్‌బంత్‌ను విజయవంతం చేయాలని నేతలు కోరారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశంలో సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఎన్.బ్రహ్మయ్య, వి.నరసింహారావు, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
భారత్ బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యువజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జిలాని తెలిపారు. ఈ మేరకు పోస్టర్ ఆవిష్కరించారు.
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు ఏపీటీఎఫ్ మద్దతు తెలియజేస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు కె.బసవలింగారావు, సయ్యద్‌చాంద్‌బాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.