వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ల్‌ ఆన్‌లైన్‌ సేవలు

ABN , First Publish Date - 2020-03-28T11:18:09+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నేరుగా ఇంటికే సేవలు అందిస్తోందని అందులో భాగంగా వినియోగదారులకు ఆన్‌లైన్‌ ద్వారా సేవలు అందిస్తున్నట్లు...

వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ల్‌ ఆన్‌లైన్‌ సేవలు

గుంటూరు (తూర్పు), మార్చి 27: కరోనా నియంత్రణలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నేరుగా ఇంటికే సేవలు అందిస్తోందని అందులో భాగంగా వినియోగదారులకు ఆన్‌లైన్‌ ద్వారా సేవలు అందిస్తున్నట్లు జిల్లా జనరల్‌ మేనేజర్‌ కె.నవీన్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త సీము నుంచి అన్ని మిగతా సేవల కోసం సెల్‌ నం: 94929 31991కు ఎస్‌ఎంఎస్‌, లేదా ఫోను చేసి సేవలు పొందవచ్చని తెలిపారు. మిగతా వివరాలకు 1991కు కాల్‌ చేయవచ్చన్నారు. ‘మై బీఎస్‌ఎన్‌ఎల్‌ యాప్‌’ ద్వారా వినియోగదారులు ఇంటివద్ద నుంచే సేవలు పొందగలరని తెలిపారు. 

Updated Date - 2020-03-28T11:18:09+05:30 IST