సంగం డెయిరీ రూ.70 కోట్ల బోనస్‌ ప్రకటన

ABN , First Publish Date - 2020-03-21T10:01:39+05:30 IST

సంగం డెయిరీ ఆర్జించిన లాభాలను సంగం ఉన్నతికి పాటుపడుతున్న పాల ఉత్పత్తిదారులకు బోనస్‌ రూపంలో అదించాలని పాలకవర్గ నిర్ణయించిన్నట్లు సంగం డెయిరీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌

సంగం డెయిరీ రూ.70 కోట్ల బోనస్‌ ప్రకటన

  • రూ. 910 కోట్లకు చేరిన టర్నోవర్‌
  • ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
  • సంగం డెయిరీ చైర్మన్‌ నరేంద్రకుమార్‌

చేబ్రోలు, మార్చి 19: సంగం డెయిరీ ఆర్జించిన లాభాలను సంగం ఉన్నతికి పాటుపడుతున్న పాల ఉత్పత్తిదారులకు బోనస్‌ రూపంలో అదించాలని పాలకవర్గ నిర్ణయించిన్నట్లు సంగం డెయిరీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ తెలిపారు. గురువారం వడ్లమూడి సంగం డెయిరీలో పాలకవర్గ సమావేశం జరిగింది. 

అనంతరం నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ఆర్థిక స్థితిగతులపై పాలకవర్గ చర్చించి సంగం డెయిరీ ఆర్జించిన లాభాల్లో రూ. 70 కోట్లను పాల ఉత్పత్తిదారులకు బోనస్‌ రూపంలో అందించాలని నిర్ణయించామన్నారు. జిల్లాలో వ్యాల్యూ ఆధారంగా ప్రతి 100 రూపాయలకు గేదెపాలకు రూ. 15, ఆవు పాలకు రూ. 14 బోనస్‌ రూపంలో అందిస్తామన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గేదె పాలకు రూ. 3, ఆవు పాలకు రూ. 2, చిత్తూరు జిల్లాలో రూ. 2 లీటరుకు బోనస్‌గా అందిచనున్నట్లు చెప్పారు. సంగం డెయిరీలో కొత్త ప్లాంటు ప్రారంభించామన్నారు.  సంగం ఉద్యోగులకు వేతన అంతరాలు ఉన్నట్లు గుర్తించి ఎసైన్‌మెంట్‌ ఉద్యోగులలో జూనియన్‌ అసిస్టెంట్లకు రూ.1800, సినియర్‌ అసిస్టెంట్లకు రూ. 2000 ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అలాగే సైలేజ్‌ ఉత్పత్తిని ప్రారంభించామని ఇప్పటికే సహకార రంగంలోని డెయిరీలతో సైలేజ్‌ పంపిణీకి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. సంగం రైతులకు రాయితీపై సైలేజ్‌ గడ్డిని అందిస్తామన్నారు. సంగం డెయిరీ షేర్‌ క్యాపిటల్‌ను రూ. 150 కోట్లకు పెంచాలని పాలకవర్గ తీర్మానించిందన్నారు. బిస్కెట్ల తయారీ ట్రయల్‌ రన్‌ను పూర్తి చేసుకొని మార్కెట్‌లో ప్రవేశపెట్టటానికి సిద్ధం చేశామన్నారు. నెల రోజుల వ్యవధిలో మ్యాంగో జ్యూస్‌ వంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎండీ గోపాలకృష్ణన్‌, పాలకవర్గ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-21T10:01:39+05:30 IST