ఎంపీ నందిగం సురేష్ రాజీనామా చేయాలి
ABN , First Publish Date - 2020-12-30T05:22:47+05:30 IST
దళితుల మధ్య చిచ్చుపెడుతున్న ఎంపీ నందిగం సురేష్ తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ ఎస్సీ, ఎస్టీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.
బీజేపీ ఎస్సీ, ఎస్టీ మోర్చా నాయకులు
గుంటూరు(సంగడిగుంట), డిసెంబరు 29: దళితుల మధ్య చిచ్చుపెడుతున్న ఎంపీ నందిగం సురేష్ తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ ఎస్సీ, ఎస్టీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. అరండల్‌పేటలోని కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజధాని ఉద్యమం, ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సమావేశంలో దారా అంబేద్కర్, తిరువీధుల శంకర్, ప్రసాద్ ,కొర్రపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.