పురుగుమందు తాగి వలంటీరు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-07T04:51:19+05:30 IST

పురుగుమందు తాగి గ్రామ వలంటీరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది.

పురుగుమందు తాగి వలంటీరు ఆత్మహత్య

  బెల్లంకొండ, డిసెంబరు6: పురుగుమందు తాగి గ్రామ వలంటీరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్యా నరసింహనాయక్‌(27) మద్యానికి బానిస అయ్యాడు. నాలుగు రోజుల నుంచి కాపుసారా అతిగా సేవిస్తుండడంతో ఇంట్లో గొడవ జరగుతోంది. ఈ క్రమంలో సారా సేవించిన అనంతరం పురుగుమందు తాగి పొలంలో పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  అతనికి భార్య పార్వతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దీనిపై ఎటువంటి పోలీసుకేసు నమోదు కాలేదు. 

Read more