ఎమ్మెల్యే పీఏనంటూ బెదిరింపు

ABN , First Publish Date - 2020-11-26T04:46:54+05:30 IST

తాను ఎమ్మెల్యే పీఏనని, చెప్పినట్లు వినకపోతే నీ అంతుచూస్తానని ఓ వ్యక్తి ఫోన్‌లో బెదిరింపులకు దిగడంతో బాధితుడు పాతగుంటూరు పోలీసులను బుధవారం ఆశ్రయించాడు.

ఎమ్మెల్యే పీఏనంటూ బెదిరింపు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

గుంటూరు (కార్పొరేషన్‌), నవంబరు 25: తాను ఎమ్మెల్యే పీఏనని, చెప్పినట్లు వినకపోతే నీ అంతుచూస్తానని ఓ వ్యక్తి ఫోన్‌లో బెదిరింపులకు దిగడంతో బాధితుడు పాతగుంటూరు పోలీసులను బుధవారం ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి.. పాతగుంటూరులోని బాలాజీనగర్‌ 7వ లైనుకు చెందిన రాగం కృష్ణ పూలమార్కెట్‌ వద్ద బంగారం వ్యాపారం చేస్తున్నాడు. ఐదేళ్లక్రితం పెదకాకాని మండలం తక్కెళ్లపాడుకు  చెందిన మహిళ  36 గ్రాముల బంగారం తాకట్టు పెట్టి రూ. 60 వేలు అప్పుగా తీసుకుంది. దీనికి సంబంధించి వడ్డీ కూడా కట్టలేదు. తాజాగా ఆమె వచ్చి తన బంగారు ఇవ్వాలని అతన్ని అడిగింది. ఇదే సమయంలో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి  సెల్‌ నం. 9177649654 నుంచి కాల్‌చేసి తాను పొన్నూరు ఎమ్మెల్యే  పీఏనని బంగారం వ్యవహారం సెటిల్‌ చేయాలని బెదిరించాడు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదని చెప్పారు.  ఈ మేరకు పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ నాగరాజు  విచారించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read more