కార్పొరేషన్‌ల పదవులతో రాజ్యాధికారం
ABN , First Publish Date - 2020-11-16T05:20:14+05:30 IST
బీసీ కార్పొరేషన్‌లకు పదవులను కేటాయించి రాజ్యాధికారంలో భాగం కల్పించారని శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ మండెపూడి పురుషోత్తం పేర్కొన్నారు.

శాలివాహన కార్పొరేషన్ చైౖర్మన్ పురుషోత్తం
గుంటూరు, నవంబరు 15: బీసీ కార్పొరేషన్‌లకు పదవులను కేటాయించి రాజ్యాధికారంలో భాగం కల్పించారని శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ మండెపూడి పురుషోత్తం పేర్కొన్నారు. వైసీపీ జిల్లా కార్యదర్శి బండారు శ్రీనివాస్ నేతృత్వంలో గోరంట్ల ఎస్సీ కాలనీలో ఆదివారం పురుషోత్తం, వైసీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు కోనూరు సతీష్‌శర్మలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా వైసీపీ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మిన్నకూరి శంకర్‌యాదవ్, ఏసుబాబు, జంగా జయరాజయ్, రాధ, శివకుమార్, కిషోర్, శివ తదితరులు పాల్గొన్నారు.