టీడీపీ నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ
ABN , First Publish Date - 2020-11-13T06:48:02+05:30 IST
పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌సలాం కుటుంబసభ్యుల ఆత్మకు శాంతిచేకూరాలని గురువారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వేగేశన నరేంద్రవర్మ పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు.
బాపట్ల, నవంబరు 12: పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌సలాం కుటుంబసభ్యుల ఆత్మకు శాంతిచేకూరాలని గురువారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వేగేశన నరేంద్రవర్మ పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన్నారు. హత్యలు చేసి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియులు చేయటం జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తప్పుడు కేసులతో ప్రజలను ఇబ్బంది పెట్టే పనిలోనే ఉన్నారన్నారు. అబ్దుల్‌సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన పోలీసులను వెంటనే శిక్షించాల్సిందిపోయి నిందితులకు అండగా ఉండటం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్రార్, షేక్‌పరీద్‌మస్తాన్, షాకా, గాలిబ్, బంటూ, పీరా, మస్తాన్, తాహీర్, మొహిద్దీన్, వి.వీరయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.