వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కుమారుడిని..

ABN , First Publish Date - 2020-10-28T14:39:21+05:30 IST

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో..

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కుమారుడిని..

బాపట్ల(గుంటూరు): వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఓ తల్లి తన కుమారుడిని కర్రకు మేకులు కొట్టి దానితో తీవ్రంగా కొట్టి గాయపరిచిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మహిళా పోలీసు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... బాపట్ల పట్టణంలోని 33వవార్డు  అరవకాలనీకి చెందిన గుంజి లక్ష్మి భర్తను వదిలి మరొకరితో సహజీవనం చేస్తోంది.  తరచు తన పిల్లలు గుంజి దుర్గారెడ్డి, గుంజి వరలక్ష్మిని హింసిస్తోంది. మంగళవారం ఓ కర్రకు మేకులు కొట్టి దానితో విచక్షణ రహితంగా పిల్లలను కొట్టి బయటకు నెట్టివేసింది. చుట్టుపక్కల వారు చూసి సచివాలయ మహిళా పోలీసుకు ఫిర్యాదు చేయగా ఆమె పట్టణ సీఐ బి.అశోక్‌బాబుకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-28T14:39:21+05:30 IST