అక్రమ నిర్మాణాలను ఆపండి

ABN , First Publish Date - 2020-12-15T05:48:26+05:30 IST

బాపట్ల పట్టణంలోని రథంబజారులో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను ఆపాలని మున్సిపల్‌ కమిషనర్‌ను పురావస్తుశాఖ సూపరింటెండెంట్‌ సుశాంత్‌కుమార్‌ ఆదేశించారు.

అక్రమ నిర్మాణాలను ఆపండి

 పురావస్తు శాఖ ఆదేశం

 

బాపట్ల, డిసెంబరు 14: బాపట్ల పట్టణంలోని రథంబజారులో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను ఆపాలని మున్సిపల్‌ కమిషనర్‌ను పురావస్తుశాఖ సూపరింటెండెంట్‌ సుశాంత్‌కుమార్‌ ఆదేశించారు.  అక్రమ నిర్మాణాలపై స్థానిక న్యాయవాది దగ్గుమల్లి కిరణ్‌కుమార్‌ పురావస్తుశాఖాధికారులకు ఫిర్యాదు చేయటంతో వారు ఈ విధంగా స్పందించారు. ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలంటే పురావస్తుశాఖ అనుమతులు కావాలని స్పష్టం చేశారు. దేవాలయం చుట్టూ భవనాల నిర్మాణానికి ప్లాన్‌లు కూడా మంజూరు చేయరాదని ఆదేశించారు. తనకు లేఖ అందిందని, రధం బజారులో నిర్మాణాలకు పురపాలక సంఘం నుంచి ఏ విధమైన అనుమతులు ఇవ్వలేదని  మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-15T05:48:26+05:30 IST