అభివృద్ధి పనుల్లో అక్రమాలపై విజి..లెన్స్‌

ABN , First Publish Date - 2020-12-12T05:29:24+05:30 IST

పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ న్యాయవాది దగ్గుమల్లి కిరణ్‌కుమార్‌ ఫిర్యాదు నేపథ్యంలో శుక్రవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు.

అభివృద్ధి పనుల్లో అక్రమాలపై విజి..లెన్స్‌

 బాపట్ల,డిసెంబరు 11: పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ న్యాయవాది దగ్గుమల్లి కిరణ్‌కుమార్‌ ఫిర్యాదు నేపథ్యంలో శుక్రవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. ఆయా పనులను పరిశీలించి తమ వెంట కొన్ని రికార్డులను తీసుకెళ్లారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌ను వివరణ కోరగా అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడలేదన్నారు. రికార్డులు ప్రకారం విజిలెన్స్‌ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-12T05:29:24+05:30 IST