-
-
Home » Andhra Pradesh » Guntur » bapatla
-
తీరంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-12-07T04:58:58+05:30 IST
బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో స్నానానికి వచ్చి అలలు ఉధృతికి కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందాడు.

బాపట్లరూరల్, డిసెంబరు 6: బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో స్నానానికి వచ్చి అలలు ఉధృతికి కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రాయల సురేష్(19) ఆదివారం సూర్యలంక తీరానికి సముద్ర సాన్నానికి వచ్చాడు. అలల తాకిడికి యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.