ఎస్పీ కార్యాలయ ఏర్పాటుకు భవనాల పరిశీలన
ABN , First Publish Date - 2020-11-16T05:02:07+05:30 IST
కాబోయే బాపట్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం ఏర్పాటు విషయమై పరిశీలించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశిల్ ఆదివారం బాపట్ల విచ్చేశారు.

బాపట్ల, నవంబరు 15: కాబోయే బాపట్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం ఏర్పాటు విషయమై పరిశీలించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశిల్ ఆదివారం బాపట్ల విచ్చేశారు. బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని భవన సముదాయాలను ఆయన పరిశీలించారు. డీఎస్పీ కార్యాలయం, క్వార్టర్స్‌ను కూడా పరిశీలించిన అనంతరం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని కలిసి చర్చించారు. తాత్కాలిక కార్యాలయాలకు హెచ్‌ఆర్‌డీ భవనాలు అనుకూలంగా ఉంటాయని, అదేవిధంగా సూర్యలంక రోడ్డులోని కొణిజేటి రోశయ్య కళాశాల, ఎంసీఏ కళాశాల, కర్లపాలెం రోడ్డులోని బాపట్ల జూనియర్ కళాశాల వంటి ఇతర ప్రైవేటు భవనాలు కూడా తీసుకొని కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి తగిన విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయటంతోపాటు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోన తెలిపారు.