బ్యాంకర్లు రైతులకు విరివిగా రుణాలందించాలి : జేసీ

ABN , First Publish Date - 2020-03-18T11:18:19+05:30 IST

జిల్లాలో వ్యవసాయం, సంబంధి త ఆధారిత రంగాలను ప్రోత్సహిం చేందుకు బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించి రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు

బ్యాంకర్లు రైతులకు విరివిగా రుణాలందించాలి : జేసీ

గుంటూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయం, సంబంధి త ఆధారిత రంగాలను ప్రోత్సహిం చేందుకు బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించి రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేసేందుకు సహక రించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్‌లోని డీఆర్‌టీసీ మీటింగ్‌ హాల్‌లో జిల్లా బ్యాంకర్ల సమన్వ య కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 2019-20 ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికలో వివిధ రంగాలకు కేటాయించి న లక్ష్యాల్లో బ్యాంకర్లు అందించిన రుణాలపై జేసీ సమీక్షించారు.


రూ. 27,109.10 కోట్ల తో రుణ ప్రణాళికను నిర్దేశించగా గత ఏడాది డిసెం బరు నెలాఖరుకు రూ.18,987.16 కోట్లు పంపిణీ చేసి 70.04 శాతం లక్ష్యాన్ని అధిగమించారని చెప్పారు. కౌలు రైతులకు వ్యవసాయ పెట్టుబడి రుణాల ను మానవత ధృక్పథంతో ఇవ్వాలని సూచించారు. విద్యా రుణాలకు సంబంధించి రూ. 457.91 కోట్ల లక్ష్యం కాగా కేవలం రూ. 84.60 కోట్లు మాత్రమే 18.48 శాతం ఇచ్చారని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు నిర్దేశించిన రుణాలను 100 శాతం అధిగమించినందుకు బ్యాంకర్లను జేసీ అభినందిం చారు. రానున్న ఖరీఫ్‌ నుంచి పంటల బీమీ ఈ-కర్షక్‌ ద్వారా చేయడం జరుగుతుందన్నారు.


మొదటి బకాయిల వసూళ్లకు గ్రామ సచివాలయం లోని వ్యవసాయ, సంక్షేమ శాఖ ఉద్యోగులు, బ్యాంకర్లతో కలిపి కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించి 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రౌండింగ్‌ జరగని యూ నిటల్‌ సబ్సిడీని బ్యాంకర్లు వెంటనే జమ చేయాలని ఆదేశించారు. తెనాలి, చిలకలూరిపేట, పొన్నూరు పీఎంఏవై అర్బన్‌ పథకం ద్వారా ఏపీ టిడ్కో నిర్మించిన 2,109 గృహాలకు బ్యాంకర్లు రూ. 6,407 కోట్లు రుణాలు అందించా రని, సంబంధిత లబ్ధిదారులతో ట్రైపార్టీ అగ్రిమెంట్‌లు చేసే అంశం పరిశీల నకు మునిసిపల్‌ కమిషనర్లు, బ్యాంకర్లతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేయను న్నట్లు తెలిపారు.


వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల పరిశీలన కోసం  కలెక్టర్‌ ఛైర్మన్‌గా, జడ్పీ సీఈవో, వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం, వివిధ సంక్షేమ శాఖ ల అధికారులు, నాబార్డు డీడీఎం సభ్యులుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతోన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 2020-2021 ఆర్థి క సంవత్సరంలో పంటల పెట్టుబడికి రూ. 13,035 కోట్లు, వ్యవసాయ అను బంధ రంగాలకు రూ. 3,436 కోట్లు, సూక్ష్మ, చిన్న మధ్యతరహా  పరిశ్రమల కు రూ.4,627 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.1,902 కోట్లు, ఇతర రంగా లకు రూ.7,001 కోట్లు కలిపి మొత్తం రూ.30,001 కోట్లు బ్యాంకర్ల ద్వారా రుణాలు అందించేందుకు వార్షిక రుణప్రణాళికని ఖరారు చేశారు. సమావే శంలో ఆంధ్రా బ్యాంకు డీజీఎం ఎం.శ్రీనివాస్‌, నాబార్డు డీడీఎం కార్తీక్‌, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ పీ వెంకటేశ్వరరావు, ఛైతన్య గోదావరి గ్రామీణ బ్యాం కు ఛైర్మన్‌ కామేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ యుగంధర్‌కుమార్‌, వ్యవసాయ శాఖ జేడీఏ విజయభారతి, వివిధ సంక్షేమ శాఖలఅధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-18T11:18:19+05:30 IST