రైతు వ్యతిరేక చట్టాలను ఉప సంహరించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-17T06:03:45+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బహుజన ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు దొంతా సురేష్‌ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కాగడాలతో నిరసన ప్రదర్శన చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను ఉప సంహరించుకోవాలి
లాడ్జి సెంటర్‌లో కాగడాల ప్రదర్శన చేస్తున్న సురేష్‌, శ్రీనివాసరావు తదితరులు

గుంటూరు, డిసెంబరు 16: రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బహుజన ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు దొంతా సురేష్‌ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కాగడాలతో నిరసన ప్రదర్శన చేశారు. కోట్లాది మంది రైతులు వ్యతిరేకిస్తోన్న మూడు సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో తన్నీరు సాంబయ్య, వినయ్‌కుమార్‌, జూపూడి శ్రీనివాసరావు, చిష్టీ, మనోజ్‌, సుబ్రమణ్యం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-17T06:03:45+05:30 IST