ఆటోను ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2020-02-12T11:29:51+05:30 IST

కొలకలూరులో లారీ ఆటోను ఢీకొన్న సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం ఫిరంగిపురానికి చెందిన..

ఆటోను ఢీకొన్న లారీ

  • ముగ్గురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

తెనాలి రూరల్‌, ఫిబ్రవరి 11 :  కొలకలూరులో లారీ ఆటోను ఢీకొన్న సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం ఫిరంగిపురానికి చెందిన సోదరులు ఆనంద్‌, మోజెస్‌లు పసుపు, కారం విక్రయాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అదే గ్రామం ఆటో తీసుకుని మంగళవారం దుగ్గిరాలలో పసుపు కొనుగోలు చేసి తమ ప్రాంతానికి ఆటోలో తీసుకు వెళుతుండగా మండల పరిధిలోని కొలకలూరు కూడలి వద్ద గుంటూరు నుంచి వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ గోపీతోపాటు ఆనంద్‌, మోజెస్‌లు తీవ్రంగా గాయపడ్డారు.  లారీ డ్రైవర్‌ వాహనాన్ని వదిలి పెట్టి పరారయ్యాడు. స్థానికులు క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.  అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు తరలించారు. ఆటోడ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-02-12T11:29:51+05:30 IST