ఆశాల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-11-22T05:00:55+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఆశా కార్యకర్తల నియమకానికి అర్హులైన అభ్యర్థినులు దరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఆశాల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో 50 పోస్టులు భర్తీకి చర్యలు


గుంటూరు (మెడికల్‌) నవంబరు 21: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఆశా కార్యకర్తల నియమకానికి అర్హులైన అభ్యర్థినులు దరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థినులు ఆయా సచివాలయాల పరిధిలో నివసిస్తున్న వారై ఉండాలన్నారు.  25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండి, వివాహితులై ఉండాలని, పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.  తెనాలిలో 12 పోస్టులు, వినుకొండలో 12, మాచర్లలో 10, మంగళగిరిలో 4, పొన్నూరులో 1, చిలకలూరిపేటలో 6, సత్తెనపల్లిలో 1, బాపట్లలో 4 పోస్టులు ఉన్నట్లు ఆమె తెలిపారు. దరఖాస్తులు స్ధానిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీపీ యూనిట్లులో లభిస్తాయని డాక్టర్‌ యాస్మిన్‌ తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను నాలుగు రోజుల్లోపు సంబంధిత వైద్యాధికారికి అందజేయాలని డీఎంహెచ్‌వో యాస్మిన్‌ పేర్కొన్నారు. 

Read more