శాలివాహన నేత అరుణ్‌ప్రసాద్‌కు నివాళి
ABN , First Publish Date - 2020-12-05T05:31:54+05:30 IST
శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ అరుణ్‌ప్రసాద్ అకాల మరణం తీరని లోటని కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా, నగర నాయకులు తెలిపారు.

గుంటూరు, డిసెంబరు 4: శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ అరుణ్‌ప్రసాద్ అకాల మరణం తీరని లోటని కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా, నగర నాయకులు తెలిపారు. శుక్రవారం నగరంలో అరుణ్‌ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోదుకూరు హరిబాబు, పారెళ్ల బసవేశ్వరరావు, నడికుడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.