గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు అరెస్టు
ABN , First Publish Date - 2020-11-14T04:28:36+05:30 IST
గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి మూడున్నర కిలోల గంజాయి, రూ.3,500 నగదు సీజ్ చేసినట్లు ఈస్ట్ డీఎస్పీ బి.సీతారామయ్య తెలిపారు.
మూడున్నరకిలోల గంజాయి, రూ.3,500 నగదు సీజ్
విశాఖ ఏజన్సీ నుంచి అక్రమ రవాణ
గుంటూరు, నవంబరు 13: గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి మూడున్నర కిలోల గంజాయి, రూ.3,500 నగదు సీజ్ చేసినట్లు ఈస్ట్ డీఎస్పీ బి.సీతారామయ్య తెలిపారు. శుక్రవారం అరండల్‌పేట స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏటుకూరు రోడ్డులో గల కమ్మ శేషయ్య గ్రౌండ్స్‌లో కొందరు పోలీసులకు సమాచారం అందింది. సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పోలీస్ సిబ్బంది గ్రౌండ్స్‌కు వెళ్లి దాడి చేయగా కొంతమంది పారిపోతుండగా పట్టుకుని తనిఖీలు చశారు. సంగడిగుంటకు చెందిన షేక్ గౌస్‌బాషా, అందుగుల కుమార్ బాబు, షేక్ మస్తాన్‌వలి, మేడికొండూరు విశాల్ కుమార్, ఇస్మాయిల్, కొత్తపేటకు చెందిన సావనిహేమంత్, బావాజీనగర్ కు చెందిన జిన్నాబత్తిన భరత్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లంబసింగిలో నందు అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్ట్ చేసిన లాలాపేట సీఐ ఫిరోజ్, హెడ్ కానిస్టేబుల్‌డి శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎస్‌కే నాగూర్‌వలి, టి.శ్రీనివాసరావు, వి.చినవెంకట్రావు, ఎన్.శామ్యూల్‌రాజ్, పి.గోవిందరావు తదితరులను డీఎస్పీ అభినందించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే తన ఫోన్ నెంబర్ 8688831309కు సమాచారం ఇవ్వాలని సూచించారు.