ప్రజారోగ్యాన్ని కాపాడటంలో జగన్‌ ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2020-12-11T05:30:00+05:30 IST

ప్రజారోగ్యాన్ని కాపాడటంలో జగన్‌ ప్రభు త్వం ఘోరంగా వైఫల్యం చెం దిందని నరసరావుపేట ని యోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు తెలిపారు.

ప్రజారోగ్యాన్ని కాపాడటంలో జగన్‌ ప్రభుత్వం విఫలం
నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్‌ అరవిందబాబు

నరసరావుపేట రూరల్‌, డిసెంబరు 11 : ప్రజారోగ్యాన్ని కాపాడటంలో జగన్‌ ప్రభు త్వం ఘోరంగా వైఫల్యం చెం దిందని నరసరావుపేట ని యోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు తెలిపారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొనకపోతే ఏలూరు తరహా వింత వ్యాధులు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా సాగు నీటి వనరులకు స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పులిమి వెంకట రామిరెడ్డి, మొండితోక రామారావు, గూడూరు శేఖర్‌, మన్నం ఆంజనేయులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T05:30:00+05:30 IST