ఆర్టీసీ సర్వీసులు.. అస్తవ్యస్తం!
ABN , First Publish Date - 2020-12-20T05:18:02+05:30 IST
లాక్‌డౌన్ తర్వాత జిల్లాలో ఆర్టీసీ సర్వీసులు అస్తవ్యస్తంగా మారిపోయాయి.

ఆదరణ ఉన్న రూట్లలో బస్సులు నిల్
బస్సులు నడిపేందుకూ రాజకీయ ఒత్తిళ్లు..
తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
గుంటూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ తర్వాత జిల్లాలో ఆర్టీసీ సర్వీసులు అస్తవ్యస్తంగా మారిపోయాయి. అద్దె బస్సులు లేవని కుంటిసాకులు చూపుతూ ఆదరణ ఉన్న మార్గాల్లో బస్సులు నడపడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- గతంలో పేరేచర్ల - తెనాలి వయా పెద పలకలూరు, గుజ్జనగుండ్ల, కొరిటెపాడు, లాడ్జ్జి సెంటర్ మీదగా 13 సర్వీసులు నడిచేవి. ఒక్కో బస్సు రోజుకు మూడు, నాలుగు ట్రిప్పులు వేసేవి. అవి గుజ్జనగుండ్ల, పలకలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కళాశాలలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేవి. అలాంటిది నేడు ఆ మార్గంలో ఒక్క బస్సుని కూడా నడపడం లేదు.
- గుంటూరు - బండారుపల్లి వయా టీజే పీఎస్ కళాశాల మీదుగా రోజుకు ఎనిమిది ట్రి ప్పులు ఉండేవి. దానిని ఇప్పుడు కేవలం రెండు ట్రిప్పులకు పరిమితం చేశారు. గుంటూరు - జొన్నలగడ్డ, గుంటూరు-దామరపల్లి- గరికపాడు సర్వీసులను నడపడం లేదు.
- గుంటూరు - తెనాలి వయా నందివెలుగు ఎనిమిది బస్సులు ఉండేవి. అవి రోజుకు 40 ట్రిప్పులు నడిచేవి. నేడు కేవలం ఐదు ట్రిప్పులు మాత్రమే తిరుగుతున్నాయి.
- గుంటూరు - తెనాలి మధ్యన నాన్‌స్టాప్ బస్సులకు అంతగా ఆదరణ ఉండదు. అయినా ఇటీవల కొన్నిరోజులపాటు నడిపారు. తీరా కిలోమీటర్‌కి రూ.18 కూడా రాకపోవడంతో వాటిని నిలుపు దల చేశారు.
- చేబ్రోలు సమీపంలో ఉన్న కొత్తరెడ్డిపాలేనికి వైసీపీ నాయకు లు చెప్పారని కొత్తగా సర్వీసు నడుపు తున్నారు. ఆ బస్సు లో కనీసం 10 మంది కూడా ఎక్క డం లేదు. ఇలా రాజకీయ ఒత్తిళ్లు వచ్చిన మార్గాల్లో బస్సులు నడుపుతూ డిమాండ్ ఉన్న వాటిల్లో నడపకపోతుండటం విమర్శలకు తావిస్తోంది.
- మంగళగిరి డిపోకు చెందిన ఒక బస్సు గతంలో గుంటూరు - నంబూరు మధ్యన నడి చేది. ఆ బస్సుని మంగళగిరి నుంచి గుంటూ రు మీదుగా తెనాలికి నడుపుతున్నారు. ఆ బ స్సుకి ఆదరణ లేకపోయినా కొనసాగిస్తున్నారు.