‘నా కారే ఆపుతారా’ అంటూ రెచ్చిపోయిన రేవతి!

ABN , First Publish Date - 2020-12-10T15:38:56+05:30 IST

వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి రెచ్చిపోయారు. ‘నా కారే ఆపుతారా?’ అంటూ కాజా టల్ గేట్ వద్ద సిబ్బందిపై దాడి చేశారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్తున్న రేవతి కారుకు టోల్‌గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డుపెట్టారు.

‘నా కారే ఆపుతారా’ అంటూ రెచ్చిపోయిన రేవతి!

గుంటూరు: వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి రెచ్చిపోయారు. ‘నా కారే ఆపుతారా?’ అంటూ కాజా టల్ గేట్ వద్ద సిబ్బందిపై దాడి చేశారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్తున్న రేవతి కారుకు టోల్‌గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డుపెట్టారు. కోపంతో కారు దిగిన ఆమె టోల్ సిబ్బందిపై రెచ్చిపోయారు. బారికేడ్‌ను పక్కకు నెట్టేసి, సిబ్బందిపై చేయి చేసుకున్నారు. రేవతి హడావిడితో టోల్‌గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. టోల్ ఫీజు నుంచి ఆమెకు మినహాయింపు లేకపోయినప్పటికీ టోల్ కట్టకుండా వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు. దీంతో టోల్ గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డంపెట్టి ఆమె కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారు దిగిన ఆమె పై విధంగా రెచ్చిపోయారు.

Updated Date - 2020-12-10T15:38:56+05:30 IST