జిల్లాలో 7.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం
ABN , First Publish Date - 2020-10-19T09:53:13+05:30 IST
జిల్లాలో 7.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం

గుంటూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం 37 మండలాల్లో స్వల్పంగా 7.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అధికంగా చుండూరు మండలంలో 49.4 మి.మీ, తక్కువగా చిలకలూరిపేట మండలంలో 0.6 మి.మీ వర్షం కురిసింది. ఇప్పటివరకు జిల్లాలో 75.8 మి.మీ వర్షపాతం నమోదు కావలసి ఉండగా 132.2 మి.మీ కురిసి 74 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.