23 నుంచి ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

ABN , First Publish Date - 2020-10-19T09:52:08+05:30 IST

23 నుంచి ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

23 నుంచి ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన

జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటు


గుంటూరు(విద్య),అక్టోబరు 18: ఇంజనీరింగ్‌  కళాశాలల్లో ప్రవేశం కోసం  నిర్వహించే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తొలివిడత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నల్లపాడులోని ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, నర్సరావుపేటలోని జేఎన్‌టీయూ కళాశాలలో సర్టిఫికెట్లు పరిశీలన నిర్వహించనున్నారు. స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ, మాజీ సైనికుల పిల్లల కోసం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రత్యేకంగా సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. తొలిరోజు ఒకటి నుంచి 20వేల ర్యాంకు వరకు హాజరు కావాలి. 

Updated Date - 2020-10-19T09:52:08+05:30 IST