జిల్లాలో మరో..నాలుగు కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-18T09:37:08+05:30 IST

జిల్లాలో ఆదివారం నాలుగు కరోనా కేసులు వెలుగు చూశాయి. గుంటూరు నగరంలోని సంగడిగుంటలో

జిల్లాలో మరో..నాలుగు కరోనా కేసులు

గుంటూరు (సంగడిగుంట) మే17:  జిల్లాలో ఆదివారం నాలుగు కరోనా కేసులు వెలుగు చూశాయి. గుంటూరు నగరంలోని సంగడిగుంటలో ఒకటి, మాచర్లలో ఒకటి, తాడేపల్లిలో రెండు వచ్చాయి. వీటితో కలిపి జిల్లాలో 417 కేసులయ్యాయి. 275 మంది డిశ్చార్జి కాగా 134 మంది చికిత్స పొందుతున్నారు. 8 మంది మృతి చెందారు. గుంటూరులో జీఎంసీ రిసోర్సింగ్‌ విభాగ ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది. ఏఎన్‌ఎంగా పని చేస్తున్న ఆమె సోదరికి గతంలో పాజిటివ్‌ వచ్చింది.  పెనుమాకలో 42 మందికి కరోనా స్వాబ్‌ పరీక్షలు నిర్వహించారు.


పాజిటివ్‌ నిర్ధారణ కేసుకు సంబంధించి 14 మందిని ప్రైమరీ కాంటాక్ట్స్‌గా గుర్తించి, గోరంట్ల వద్ద వున్న క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.  తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్‌నగర్‌లో ఆదివారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు ధ్రువీకరించారు. గతంలో పాజిటివ్‌ వచ్చిన ప్రైమరీ కాంటాక్టుల ద్వారా వీరిరువురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. మాచర్ల పట్టణంలో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఎరువుల దుకాణాల వ్యాపారులు 100 మందిని మాచర్ల పట్టణ సమీపంలోని న్యూటన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో గల క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు జరిపారు. కాగా మృతుని కుటుంబసభ్యులు 13 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. 

Updated Date - 2020-05-18T09:37:08+05:30 IST