రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-12-30T05:21:36+05:30 IST
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు.
జీవీ ఆంజనేయులు
వినుకొండ, డిసెంబరు 29: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. మొద్దు ప్రభుత్వం మేల్కొని రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి మద్దతు ధర వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 760మంది రైతులు ఆత్మహత్యలకు చేసుకున్నారని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు అండగా ఉండేందుకే టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ రైతుకోసం తెలుగుదేశం అనేక కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రైతులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.