పేదల పేరు చెప్పి దోచుకుంటున్న ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2020-12-25T06:18:25+05:30 IST

పేదల ఇళ్ల స్థలాలు పేరు చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని, వీరికి

పేదల పేరు చెప్పి దోచుకుంటున్న ఎమ్మెల్యేలు
కార్యక్రమంలో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

 వినుకొండ, డిసెంబరు 24: పేదల ఇళ్ల స్థలాలు పేరు చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని, వీరికి సిగ్గు ఉందా అని తెలుగుదేశం పార్టీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. పేదలకు 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలని, పట్టణ ప్రాంతంలో నివాసం ఉండే పేదలకు పట్టణ పరిధిలోనే 2సెంట్ల స్థలం ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు గురువారం స్థల లబ్ధిదారులతో కలిసి భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బైక్‌ ర్యాలీ నిర్వహించి వెంకుపాలెం సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన పేదల ఇళ్లస్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ పేదప్రజలకు పట్టణ ప్రాంతంలోనే 2 సెంట్ల స్థలం ఇవ్వమంటే బొల్లా బ్రహ్మనాయుడు తన సొంతభూమిని పేదల పేరు చెప్పి ప్రభుత్వానికి అంటకట్టి రూ.18 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వినుకొండ పట్టణ సమీపంలో తెలుగుదేశం హయంలో మంజూరు చేసిన సుమారు 4వేల గృహాలను వెంటనే పేదలకు పంచాలన్నారు.  కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర  కార్యదర్శి షమీమ్‌ఖాన్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు సౌదాగర్‌ జానీబాషా, మండలాల అధ్యక్షులు కాటం కోటేశ్వరరావు  పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-25T06:18:25+05:30 IST